NTV Telugu Site icon

Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డిల మధ్య డైలాగ్‌ వార్‌..

Cm Revanth Reddy, Jagadish Reddy

Cm Revanth Reddy, Jagadish Reddy

Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డిల మధ్య డైలాగ్‌ వార్‌ సాగుతుంది. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఛైర్మన్ మార్పు గురించి కోర్టు మమ్మల్ని అడిగిందని, మాకు అభ్యంతరం లేదు అన్నం అని తెలిపారు. విచారణ జరుపుతామని కోర్టు చెప్పింది… విచారణ ఆపండి అని చెప్పలేదు..
గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఉంది వాళ్ళ పరిస్థితి అంటూ సీఎం వ్యాఖ్యానించారు. 81 వేల కోట్ల అప్పుకు కారణం అయ్యింది వీళ్ళు.. నల్గొండ సెంటి మెంట్ రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ సంగతి తెలిసిపోయిందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో 10 వేల కోట్లు అంచనా పెంచడం వెనక మింగింది ఎవరో తేల్చాలి? అని ప్రశ్నించారు. అందుకే కమిషన్ వేశామన్నారు. కిషన్ రెడ్డి..జగదీష్ రెడ్డి చుట్టాలు అయ్యారని తెలిపారు. డిల్లీకి బావ బమ్మర్ధులు వెళ్లి చీకట్లో కాళ్ళు పట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు వాళ్ళు చుట్టాలు అయ్యారని..ఎన్టీపీసీ కి అనుమతి ఇచ్చిందే మేమని తెలిపారు. ఎన్టీపీసీ ఉత్పత్తి చేసే పవర్ కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినామన్నారు.

Read also: CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్‌ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

ఉత్పత్తి అవ్వడానికి ఇంకా రెండేళ్లు పడుతుందన్నారు. ఇవాళ 8 రూపాయలు యూనిట్ లెక్క కొంటే నష్టం.. ఎన్టీపీసీ పనులు ఎక్కడ ఆగలేదని క్లారిటీ ఇచ్చారు. మనం కొనకపోతే వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. 9 రూపాయలు యూనిట్ చొప్పున మనం కొనాల్సి వస్తుందన్నారు. బాబు పక్కన చేరి 610 అవసరం లేదు అన్నది మీ నాయకుడు కాదా ? అని ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు పొక్క పెంచినప్పుడు వైఎస్ కేబినెట్ లో మంత్రి ఎవరు ? అని ప్రశ్నించారు. కేంద్రంలో సర్కార్ ఉండి కూడా కొట్లడింది మా ఎంపీ లు.. బాబుకు.. వైఎస్ కి ఊడిగం చేసింది మీరు అన్నారు. ఆత్మ బలిదానాల మీద అధికారంలోకి వచ్చింది మీరని తెలిపారు. ఛానల్ గుంజుకుంది మీరని మండిపడ్డారు. జర్నలిస్టు ఛానల్ సీఈఓ గా ఉంటే…జైల్ కి పంపింది మీరన్నారు. నేను మా అడ్వకేట్ నీ పెట్టీ బెయిల్ పైనా విడుదల చేయించినామన్నారు. మంది ఆడబిడ్డలను జైలుకు పంపినందుకు ఇప్పుడు మీ బిడ్డలు జైలుకు పోయారని అన్నారు. దేవుడు చూస్తాలేడా.. ఫార్మ్ హౌస్ లు కట్టుకుంది మీరు.. అన్యాయం బయట పెడితే 16 జైల్లో పెట్టింది మీరు.. భయపడతనా…నేను అన్నారు. కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారంటూ జగదీష్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Read also: Raj Gopal Reddy: యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన ఆయనదే..

జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీరు సంచులు మొస్తున్నప్పుడు నేను ఇక్కడే ఉన్న అన్నారు. సీఎం దొరికిపోయాడు కాబట్టి ఆవేశ పడుతున్నాడని మాట్లాడారు. దీనిపై అసెంబ్లీ అట్టుడుకింది. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగిస్తున్నామని స్పీకర్ అన్నారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నాపైన మూడు హత్య కేసు లు పెట్టారు. కోర్టు నన్ను నిర్దోషి గా ప్రకటించిందన్నారు. సిఎం..కోమటిరెడ్డి చేసిన మిగిలిన ఆరోపణల్లో వాస్తవాలు బయట పెట్టాలని అన్నారు. హౌజ్ కమిటీ వేయండని తెలిపారు. మా నాయకుడు చంద్రుడు అన్నారు. ఇండియా బుల్స్ ఏంది.. అనేది మాకు తెలియదన్నారు. మాకు అలవాటు లేదని, కేసీఆర్ కాలు గోటికి సరిపోతారా మీరు అంటూ మాట్లాడారు. ఆయన గురించి మాట్లాడటం ఏంది? అని ప్రశ్నించారు. డమ్మీ మంత్రి అంటున్నారు నన్ను.. డమ్మీ మంత్రి నే 20 వేల కోట్లు సంపాదిస్తే.. ఒరిజినల్ మంత్రి ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు? అని ప్రశ్నించారు. కమిషన్ ఛైర్మన్ ఎలా ఉండాలి అన్నారు. ఆయన భూ కబ్జా దారుడు అని రేవంత్.. వీ.హనుమంతరావు అన్నారు ఛైర్మన్ మీద నమ్మకం లేనప్పుడు.. కోర్టుకు పోవడం తప్పా? అని ప్రశ్నించారు.


JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్‌రెడ్డి భేటీ..