NTV Telugu Site icon

Deputy CM Bhatti Vikramarka: నేటి నుంచి ఇంటింటి సర్వే.. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం..

Mallu Nhatti Vikramarka

Mallu Nhatti Vikramarka

నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయని తెలిపారు. కలెక్టర్లు ఎనుమరెటర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు.

Read also: Hyderabad CP DP: సైబర్‌ కేటుగాళ్ల నయా దందా.. హైదరాబాద్‌ సీపీ డీపీతో ఫేక్ వాట్సప్ కాల్

మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారు, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంది అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు.

Read also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాన్య యితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Sugar Intake: పిల్లలకు స్వీట్స్, డ్రింక్స్ ఇస్తున్నారా? అనారోగ్యానికి అదే ఫస్ట్ స్టెప్..

Show comments