Site icon NTV Telugu

Delhi Liquor Case: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ సెప్టెంబర్ 11వ తేదీ వాయిదా..

Delhi Liquor Case

Delhi Liquor Case

Delhi Liquor Case: లిక్కర్ కేసు సిబిఐ చార్జ్ పై ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగింది. లిక్కర్ కేసు సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణను సెప్టెంబర్ 11 వ తేదీన జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు. ట్రయల్ కోర్ట్ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనిస్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫెర్ లేవని తెలిపారు. కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ గా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ ను సప్లై చేయాలని జడ్జ్ ఆదేశించారు.

Read also: Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత నిన్న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు ఆమె హైదరాబాద్ చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:45 గంటల విస్తారా ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉన్నారు. కవిత వెంట బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను నందినగర్ లోని ఆయన నివాసంలో కలవనున్నట్లు సమాచారం.
Kunamneni Sambasiva Rao: ‘హైడ్రా’ అనే పేరు భయానకంగా ఉంది.. కూనంనేని కీలక వ్యాఖ్యలు

Exit mobile version