Site icon NTV Telugu

Inter Admissions: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..

Inter Admissions

Inter Admissions

Inter Admissions: ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును బోర్డు మరోసారి పొడిగించింది. రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల (అక్టోబర్ 15) వ తేదీ వరకు పొడిగించింది. ఇంకా 3 వందలకు పైగా కాలేజీల అనుబంధ గుర్తింపు పెండింగ్ లో ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ నుండి మినహాయింపు ఇస్తే తప్ప.. వాటికి అనుబంధ గుర్తింపు రాని పరిస్థితి ఏర్పడింది. సుమారు 70 వేలకు పైగా విద్యార్థులు ఆ కాలేజీల్లో చేరి ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే సెప్టెంబర్‌ 23న ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్మిషన్ల గడువును బోర్డు పొడిగించిన విషయం తెలిసిందే. రూ.500 ఆలస్య రుసుముతో రెండో విడత అడ్మిషన్ల గడువుకు 30 వరకు అవకాశమిచ్చింది.

అయితే 3 వందలకు పైగా కాలేజీల అనుబంధ గుర్తింపు పెండింగ్ లో వున్న దృష్ట్యా బోర్డు మరోసారి అడ్మిషన్లు గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొందరు విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 30వరకు బోర్డు అడ్మిషన్లకు డెడ్‌ లైన్‌ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బోర్డు ఇప్పుడు మళ్లీ గడువును మరోసారి పొడిగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆలస్య రుసుము తీసుకోరు. కేవలం ప్రైవేట్‌ కాలేజీల్లో చేరేవారు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.కాగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో జనరల్‌ కోర్సుల్లో 60,525 మంది, వొకేషనల్‌ కోర్సుల్లో 21,957 మంది చొప్పున మొత్తంగా 70వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు విశ్వనీయ సమాచారం.
Bus Accident: ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన కంటైనర్‌ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు

Exit mobile version