Danam Nagender: మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల తరలింపుపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్లమ్స్ జోలికి హైడ్రా వెళ్లకూడదని ముందే చెప్పానంటూ పేర్కొన్నారు. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో చాలామంది ఎంఎల్ఏ లు మాట్లాడుతున్నారని, పార్టీ లోకి రావడానికి.. కేవలం వాళ్ళని భయపెట్టించి ఆపుతున్నారని తెలిపారు. ఇప్పటికీ మా పార్టీ తో హైదరాబాద్ ఎంఎల్ఏ గా నాతో టచ్ లో ఉన్నారు. ఉపఎన్నిక వస్తుందని భయపెట్టిస్తున్నారని తెలిపారు. హైడ్రా కూల్చివేతలపై ఈటెల రాజేందర్ కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు సాధారణంగా డిగ్నిఫయిడ్ గా ఉంటారు. ఆయన కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి కావాలని రచ్చ చేస్తున్నారన్నారు.
వాళ్ళ హయంలో కేసీఆర్ కూడా అన్నారు… అక్రమ కట్టడాలను కూల్చివేస్తమనీ.. కానీ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం.. పేదల ఇల్లు కూల్చడం సరైంది కాదు.. చిన్న పాప నా బుక్స్ లోపల ఉండిపోయాయి అనే వీడియో చూస్తుంటే… దుఃఖం ఆగలేదు అంటూ దానం కన్నీరు పెట్టుకున్నారు. పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదని, నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆయన మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయించాలని తెలిపారు. నిర్ణయించిన బఫర్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కూల్చిన ఇళ్లను అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు దాన నాగేందర్ తెలిపారు.
Cyber Fraud: ఒకే ఖాతాలో రూ.124 కోట్లు బదిలీ.. సైబర్ ఫ్రాడ్ కేసులో కీలక అంశాలు