Damodar Raja Narasimha: గాంధీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. గాంధీ ఆసుపత్రి లోని సుపరింటేండెంట్ కార్యాలయం చేరుకున్నారు. ఆస్పత్రిలో బెడ్ ల వివరాలు, ఓపి రోజు వారి వివరాలు సుపరింటేండెంట్ డాక్టర్ రాజకుమారి నీ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సీజీనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read also: Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. నేడు, రేపు మరో 20 రైళ్ళు రద్దు..
ఆస్పత్రిలో ప్రస్తుతం ఎంతమంది డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఉద్యోగులు డ్యూటీలో వున్నారు అనే దానిపై వారి వివరాలు అందించాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ సిబ్బంది, డయాగ్నస్టిక్, క్లినికల్ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సీజీనల్ వ్యాధులతో వస్తున్న రోగులకు చికిత్స అందించాలని తెలిపారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల పై చర్యలు తీసుకుంటున్నామన్నారు. గాంధీలో 869 వైరల్ టెస్టులను చేశామన్నారు. అందులో 79 డెంగ్యూ కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయని, 121 చికెన్ గునియా కేసులు నమోదయ్యాయని అన్నారు. మంకీ పాక్స్ కు సంబంధించిన ట్రీట్మెంట్ కోసం ముందస్తుగా బెడ్స్ ను అరేంజ్ చేసామన్నారు. జెరియాట్రిక్ డిపార్ట్‌మెంట్ అదనంగా గాంధీకి ఇస్తామన్నారు. వారంలో ఐవీఎఫ్‌కు సెంటర్ను అందుబాటులోకి తెస్తామని, ఎంబ్రియాలజిస్ట్ నియమించి వారం రోజుల్లో సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా.. రేవంత్ రెడ్డి చిట్ చాట్