CPI Narayana: రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల భేటీ రేవంత్ రెడ్డి కి కత్తిమీద సాములాంటిదని కీలక వ్యాఖ్యలు చేశారు. తేడావస్తే తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి పై ముద్ర వేస్తారని గుర్తు చేశారు. దానికి రేవంత్ రెడ్డి భయపడాల్సిన పని లేదన్నారు. రెచ్చగొడితే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. నీటి సమస్య, భద్రాచలం, విభజన సమస్యలు ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయిందన్నారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయారు తప్పా.. వారి మధ్య వైషమ్యాలు లేవన్నారు. ఒకప్పుడు సెంటిమెంట్ పని చేసింది.. దాన్ని యాంటీ ఆంధ్రగా వాడుకున్నారని తెలిపారు.
Read also: TGSRTC MD Sajjanar: సిటీ బస్సులో మహిళకు ప్రసవం చేసిన లేడీ కండక్టర్.. సజ్జనార్ ట్వీట్..
కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు.. ఈ రోజు హస్తిన పర్యటన ముగించి.. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, రేపు ప్రజా భవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు ఏపీ సీఎం.. దానికి అంగీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి.. అయితే, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Somu Veerraju: 8న రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండా..