CPI Narayana: CPI Narayana: ప్రధాని మోడీ విదేశీ పర్యటనపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇజ్రాయెల్ మోడల్ ను అమలు చేస్తున్నారన్నారు. రేపులు చేసే వాళ్లకు బెయిల్ ఇస్తున్నారని మండిపడ్డారు. డేరా బాబాకు బెయిలిచ్చారు, ఆయనకు ఎన్నికల వచ్చాయని బెయిల్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘోరాతి ఘోరాలు చేసిన డేరా బాబాకు పంజాబ్, హర్యానా ఎన్నికల సమయంలో బెయిల్ ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. వరవరరావు లాంటి వాళ్లకు మాత్రం బెయిల్ రాదన్నారు. ఆయన మాత్రం బాంబేలోనే ఉండాలని తెలిపారు. జమ్ము కాశ్మీర్ లో దొడ్డి దారిన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. జమ్ము కాశ్మీర్ లో ఐదు మంది ఎమ్మెల్యేలను ముందే నామినేట్ చేశారన్నారు. రేపు ఓట్ల లెక్కింపు సమయంలో, సీట్లు గెలవకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Hyderabad: గచ్చిబౌలి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. ఫ్రిడ్జ్ లో పాడైన కూరగాయలు
ప్రజల మద్దతు ఉంటే బీజేపీ ఇలా ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనలన్నీ నిష్ప్రయోజనమని తెలిపారు. బీహార్ మణిపూర్లలో ప్రధాని పర్యటించరు అని మండిపడ్డారు. బీహార్ లో వరదలు జనం ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. మణిపూర్ రావణ కష్టంలా కాలుతోంది అయిపోయిందన్నారు. ప్రధాని చాలా ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ వరదలను జాతియ విపత్తుగా తక్షణం గుర్తించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీహార్ లో సగం జిల్లాలు కరువు, సగం జిల్లాలో వరద అన్నారు. నేపాల్ ప్రభుత్వంతో మాట్లాడి ఇలాంటి విపత్తు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నేపాల్ దేశంతో మాట్లాడాలి బీహార్ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. మారోవైపు నక్సలిజం పైన అమిత్ షా సమావేశం పై ఆయన స్పందించారు. దేశంలో రేపులు, మర్డర్స్, జరుగుతున్నాయి .. వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు. అన్నలు ఆలోచించాలి, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల్లో మార్పులు తెచ్చుకోవాలన్నారు. ప్రజలతో కలిసి పోరాడాలన్నారు.
Atrocious: వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి.. ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన