NTV Telugu Site icon

CPI Narayana: క్షమించండి… మీ “అలయ్‌ బలయ్‌” కార్యక్రమానికి నేను రాను..

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: నా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు నన్ను ఆహ్వానించే మీ “అలయ్‌ బలయ్‌” కార్యక్రమానికి నేను హాజరు కాలేను క్షమించండి అంటూ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ మీకు తెలుసు.. ప్రముఖ మేధావి, ఢిల్లీలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగులుగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. విచారణలో హక్కుగా ఉన్న బెయిల్ కూడా తిరస్కరించబడింది. చివరకు 10 ఏళ్ల తర్వాత గౌరవ న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా నిర్ధారించిందని వెల్లడించారు. నేను, నా పార్టీ ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాలను అంగీకరించకపోవచ్చు, కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. చివరికి రాజ్యం… ఈ ప్రపంచం నుండి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు. మీరు పెద్దవారు.. కానీ అంతిమంగా మీరు అదే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. అతని మరణానికి ఈ ప్రభుత్వమే కారణంగా నిలిచిందన్నారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు కానీ నిరసనగా మీరు నిర్వహించే కార్యక్రమానికి నేను హాజరు కాలేనని తెలిపారు.
Alai Balai Program: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం..

Show comments