NTV Telugu Site icon

Telangana: 11ఏళ్లకు దక్కిన న్యాయం.. తల్లిని చంపిన కేసులో జైల్లోనే కొడుకు మృతి..

Telangana High Court

Telangana High Court

Telangana: కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం జరగడం లేదు. క్రిమినల్ కేసుల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బెయిల్ పిటిషన్లతో సహా క్రిమినల్ అప్పీళ్ల విచారణలో జాప్యం కారణంగా, చాలా మంది ఖైదీలు న్యాయం పొందకముందే జైలులో మరణిస్తున్నారు. ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Read also: KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం..

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన పెద్దగుండెల అలియాస్ గుండెల పోచయ్య 2013లో తన తల్లి ఎల్లవ్వను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. వృద్ధురాలిని చూసుకోలేక చెట్టుకు టవల్ తో ఉరివేసి హత్య చేశాడన్న ఆరోపణలపై దుబ్బాక పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం ఆధారాలను పరిశీలించిన సిద్దిపేట కోర్టు పోచయ్యకు 2015 జనవరి 12న జీవిత ఖైదు విధిస్తూ చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. అదే ఏడాది పోచయ్య చిన్న కుమారుడు దేవయ్య అలియాస్ డేవిడ్ హైకోర్టులో అప్పీలు చేశాడు. ఈ సమయంలో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయగా, హైకోర్టు దానిని తిరస్కరించింది. ఈ ఏడాది జులైలో ఈ అప్పీల్‌ను విచారించిన హైకోర్టు పోచయ్యను నిర్దోషిగా ప్రకటిస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

Read also: Konda Surekha: వరంగల్ ఆసుప్రతిలో మరమ్మత్తులు జరపించండి.. కొండ సురేఖ ఆదేశం..

అయితే ఆరేళ్ల క్రితమే చనిపోయాడని తెలియడంతో ఆ వార్త అందరికి షాక్ కు గురిచేసింది. 2018 ఆగస్టు 15న చర్లపల్లి బహిరంగ జైలులో పోచయ్య అస్వస్థతకు గురికావడంతో పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. 16న కుటుంబ సభ్యులు జైలుకు చేరుకోగా.. అప్పటికే మృతి చెందినట్లు జైలు సిబ్బంది తెలిపారు. చికిత్స అందించడంలో జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోచయ్య చిన్న కుమారుడు డేవిడ్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్, విచారణ అధికారి సాక్ష్యాధారాలతో కింది కోర్టు శిక్ష విధించడం సరికాదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. చనిపోయిన ఖైదీల కేసుల వివరాలు కూడా జైలు అధికారుల వద్ద ఉన్నాయని, మరణ సమాచారాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి అందజేస్తే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉండదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..

Show comments