NTV Telugu Site icon

Cordon Search: మైలార్ దేవ్ పల్లిలో కార్డెన్ సెర్చ్.. ఆటో నిండా గుట్కా ప్యాకెట్లే..!

Gutka Pakets

Gutka Pakets

Cordon Search: మైలార్ దేవ్ పల్లి లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. శాస్త్రీపూరం, అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదీయా కాలనీ, ఒవైసీ కాలనీ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పోలీసులు బలగాలు జల్లెడ పట్టారు. 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లులల్లో తనిఖీలు నిర్వహించారు. వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. గంజాయి పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి సేవించడం, తరలించడం పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్థ రాత్రులు రోడ్ల పై తిరిగే వారి తాట తీశారు. ప్రతి వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఓ ఆటో నిండా నిషేధిత గుట్కా ప్యాకెట్స్ గుర్తించి షాక్ కు గురయ్యారు. ఆటోతో పాటు గుట్కాను సీజ్ చేశారు. షేక్ మహ్మద్ అనే ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేపు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్స్ ఎవరికోసం తరిస్తున్నారు.

Read also: Pollution: ఈ నగరాలకు ఏమైంది.. ప్రతీ ఏడాది 33 వేల మరణాలు..

ఎప్పటి నుంచి గుట్కా ప్యాకెట్స్ వ్యవహారం నడుస్తున్నదానిపై ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగినా? మద్యం, డ్రగ్స్ సేవించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. నిజామబాద్ లోని బైపాస్ రోడ్డులో గంజాయి పట్టుబడింది. ఓ ఖాళీ స్దలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసుల దాడి చేశారు. 6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రెండు రోజుల వ్యవధిలో ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు 9 కిలోల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో 60 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తనిఖీలు నిర్వహించి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులను ప్రశ్నించారు. ఈ కార్డన్ సెర్చ్‌లో ఎలాంటి సర్టిఫికెట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Indian Cricket Team: భారత్ చేరుకున్న టీమిండియా.. అభిమానులకు ట్రోఫీ చూపెట్టిన రోహిత్ శర్మ!