Site icon NTV Telugu

MLC Kavitha: కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని అన్నారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి…. తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారు.
కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని కవిత అన్నారు. కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Read also: Russia: “కష్ట సమయాల్లో మా స్నేహితులను విడిచిపెట్టం”.. అమెరికా, మాకు మధ్య తేడా

బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని మండిపడ్డారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరమన్నారు. బతుకును ఆగం చేశారు.. బతుకమ్మను మాయం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలన్నారు. ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
December 9th Incarnation Festival: ఏటా డిసెంబరు 9న అవతరణ ఉత్సవం.. అసెంబ్లీలో సీఎం ప్రకటన..

Exit mobile version