Site icon NTV Telugu

Robert Vadra: హైదరాబాద్ లో రెండు రోజులు పర్యటిస్తా.. ప్రజల సమస్యలు తెలుసుకుంటా..

Robert Vadra2

Robert Vadra2

Robert Vadra: కాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వాద్రా ను ఎయిర్ పోర్ట్ లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో రెండు రోజులు పర్యటించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని తెలిపారు.

Read also: CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..

వీలైనంత వరకు తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.తెలంగాణలోని గుడిలను మస్జిదులను సందర్శిస్తానని అన్నారు. ఈరోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆయన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని దేవాలయాలు, మసీదులను సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని పెద్దతల్లి ఆలయాన్ని, బంజారాహిల్స్‌లోని మజీద్‌ను రాబర్ట్ వాద్రా సందర్శించనున్నారు.

Read also: Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేది..

మరోవైపు యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. డీఎల్ఎఫ్ భూ కుంభకోణం, బికనీర్ భూ కుంభకోణం, రూ.9600 కోట్ల కర్ణాటక లోయకుంట ఇలా ఎన్నో కుంభకోణాలకు పాల్పడిన రాబర్ట్ వాద్రా తెలంగాణ పర్యటన వెనుక రహస్యం ఏంటి? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్తారని భావిస్తున్నారా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే.. ఢిల్లీకే పరిమితమైన వాద్రా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి గల కారణాలపై ప్రస్తుత రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Jagga Reddy: సీఎం రేవంత్‌ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్‌ కు జగ్గారెడ్డి సూచన

Exit mobile version