Mahesh Kumar Goud: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్ పాటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కార్యాలయాలకు, విద్యాసంస్థలకు నేడు సెలవును ప్రకటించారు. రేపటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి 3వ తేదీ వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.
Read also: Jagga Reddy: ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని అన్నారు. నవ భారతదేశానికి నిజమైన వాస్తుశిల్పిలలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరని అన్నారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసినట్లు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించిన మహా ఆర్థిక మేధావిగా ఆయన్ను కొనియాడారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చేసిన సేవలు దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. నిజాయితీ, మంచితనం, సమర్థవంతంగా పని చేయడంలాంటివి మన్మోహన్ సింగ్ ను చూసి నేర్చుకోవాలన్నారు.
Best Songs 2024: ఈ ఏడాది దుమ్ము దులిపిన సాంగ్స్ ఇవే..