Site icon NTV Telugu

Congress: వివాదంలో పటాన్ చెరు ఎమ్మెల్యే.. మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ క్యాడర్ ఫిర్యాదు

Patan Chervu

Patan Chervu

Congress: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అతడిపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు క్యాడర్ రెడీ అవుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు సోషల్ మీడియాలో మహిపాల్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అందులో, పార్టీని తిడుతున్న మహిపాల్ రెడ్డి ఎందుకు పార్టీలోకి వచ్చారని కాంగ్రెస్ క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. అయితే, మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి మాత్రం ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని చెబుతున్నారు.

Read Also: IPL 2025 Tickets: ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్స్.. ఈ సీజన్‌లోనూ బ్లాక్ దందా! హెచ్‌సీఏ తీరు మారదా?

కాగా, మధ్యాహ్నం 2 గంటలకు అమీన్ పూర్ లోని పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ శ్రేణులు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. అనంతరం, మధ్యాహ్నం గాంధీ భవన్ వెళ్లి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై పార్టీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి నాయకులు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై రాష్ట్రంలోని పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ క్యాడర్.

Exit mobile version