NTV Telugu Site icon

Osmania University: డీఎస్సీ వాయిదా వేయండి.. అర్ధరాత్రి అభ్యర్థుల ఆందోళన..

Ou Univercity Hydrabad

Ou Univercity Hydrabad

Osmania University: డీఎస్సీని వాయిదా వేయాలని ఉస్మానియా వేదికగా డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. నిన్న ప్రభుత్వం తమ సమస్యలను నెరవేర్చాలంటూ ఆందోళన చేసిన డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజీ గ్రౌండ్ లో ఉంచారు. రాత్రి సిటీ కాలేజ్ నుండి ఉస్మానియా క్యాంపస్ వరకు అర్థరాత్రి డీఎస్సీ అభ్యర్థులు ర్యాలీగా ఉస్మానియా యూనివర్శిటీకి చేరుకొని ఆందోళన చేపట్టారు. రాత్రి అవుతున్నా మహిళలు అని చూడకుండా.. లైట్లు లేకపోయినా అక్కడే ఉంచారు. కనీసం తాగడానికి నీళ్ళు లేక లైట్లు ఆపేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Read also: Rahul Gandhi: ఈ రోజు రాయ్‌బరేలీలో రాహుల్‌గాంధీ పర్యటన.. కార్యకర్తలతో భేటీ..!

వీరి ఆందోళన పట్టించుకోని విద్యాశాఖ ప్రకటించిన విధంగా జులై 11 నుండి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది. యదావిధిగా జులై 18 నుండి డి.ఏస్.సి పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించింది. దీంతో మా ఆందోళనను అధికారులు పట్టించుకోవడం లేదని, వెంటనే డీఎస్సీని 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నారు. గతంలో టెట్ ఎక్జామ్ వ్రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే ఆలస్యమైందన్నారు. కావున వెంటనే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మద్య టెట్ లో అర్హత సాధించిన వారే వాయిదా కావాలంటున్నారు. వీరి ఆందోళనకు విద్యార్థి నాయకులెవరు మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం.

Read also: Nag Ashwin-Kalki 2898 AD: బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో ‘కల్కి’ చూడనున్న నాగ్‌ అశ్విన్‌!

కానీ ప్రభుత్వం మాత్రం వందల సంఖ్యలోనే ఉద్యోగాలు ఇస్తూ వారిని నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. ఇక మరోవైపు తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఉద్యోగార్థులు డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం నో చెబుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలు జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు యథావిధిగా జరుగుతాయని వెల్లడించింది. అభ్యర్థులు సాయంత్రం 5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో డీఎస్సీ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
India-France: చైనాకు చెక్.. భారత్- ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలు కొనుగోలు..