NTV Telugu Site icon

Samagra Kutumba Survey: అసలు ప్రక్రియ మొదలు.. నేటి నుంచి వివరాల సేకరణ..

Samagra Kutumba Survey

Samagra Kutumba Survey

Samagra Kutumba Survey: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో నేడు అసలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దశలో (బుధవారం) నుంచి మూడు రోజులుగా కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు ఎన్యూమరేటర్లు స్టిక్కర్లు వేసిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలో B.C, S.C, S.T, ఇతర వెనకబడిన వర్గాలకు అభివృద్ధి, అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు చేసేందుకు సర్వే చేస్తున్నారు. ఇక ఈ సర్వే డేటా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. కాగా.. కుటుంబ వ్యక్తిగత వివరాలను గణకులు(ఎన్యూమరేటర్లు) సేకరించడమే కాకుండా.. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల కోసం స్వగ్రామంలోని ఇల్లు వదిలి, దూరప్రాంతాల్లోని పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సర్వేలో కుల వివరాలు ఎన్యుమరేటర్లు నేటి నుంచి సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసి పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కరింగ్ 95 శాతం పూర్తయింది. GHMC పరిధిలో 19,722 ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారు. ఈరోజు నుంచి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. నేటి నుంచి 21 వరకు ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. మొత్తం 243 కులాలను ఫైనల్ చేసి క్యాస్ట్ కోడ్స్ లిస్ట్ చేసిన అధికారులు. ఎస్సీ కేటగిరీలో 59 కులాలు, ఎస్టీ కేటగిరిలో 32 కులాలు, ఇక 134 కులాలు, ఓసీ కేటగిరిలో 18 కులాలు బీసీ కేటగిరి లో చేర్చారు.
Deputy CM Bhatti Vikramarka: నేటి నుంచి ఇంటింటి సర్వే.. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం..

Show comments