NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?

Cm Revatnh Reddy

Cm Revatnh Reddy

CM Revanth Reddy: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారైంది. జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది? విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలేంటి..? తాజాగా పార్టీ మారిన వారికి చోటు దక్కుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా మరో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపి మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ, సీఎం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

Read also: Astrology: జులై 03, బుధవారం దినఫలాలు

అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణలో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ఆసక్తికర అంశం వెల్లడైంది. ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని స్పష్టమవుతోంది. నిజామాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి వస్తుందని వెల్లడించారు. త్వరలో వైద్యశాఖలో ప్రక్షాళన జరుగుతుందన్నారు. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే..
Off The Record : సౌమ్యంగా ఉండే ఆ బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యే ఒక్కసారిగా బూతుపురాణం అందుకున్నారా?