Revanth Reddy: హైడ్రా పనులకు ఎవరు అడ్డు వచ్చిన అక్రమార్కుల సంగతి ఖచ్చితంగా తేల్చుడే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం అన్నారు. న్యాయంగా అనుమతులున్న ఏ ఆస్తిని ప్రభుత్వం టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అనుమతులు ఉన్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థని ఇబ్బందులు పెట్టరన్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు. అక్రమార్కుల సంగతి కచ్చితంగా తేల్చుడే అన్నారు. గాంధీ కుటుంబంలో ఆరు తరాల గొప్పతనం చెప్పిన..
మీ గురించి చెప్పాలంటే దోపిడీ కుటుంబం… దొంగల కుటుంబం.. అధికార దుర్వినియోగం చేసి సంపాదించిన కుటుంబం మీదని కేటీఆర్, హరీష్ రావ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.హవాయి చెప్పు వేసుకొని తిరిగిన వాళ్ళు.. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కబ్జాకోరుల పట్ల హైడ్రా అంకుశం అవుతుందన్నారు. నాళాలు చెరువులు కబ్జాలు చేసి ఏడంతస్తుల మేడలు కట్టే వారి పట్ల హైడ్రా అంకుశమే అన్నారు.
Read also: Minister Komatireddy: అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
మదపుటేనుగులను అణచటానికి అంకుశాన్ని ఎలాగ ఉపయోగిస్తామో కబ్జాదారుల కోరలు తీసేందుకు హైడ్రాను అలాగే ఉపయోగిస్తామన్నారు. హైడ్రాను చూసి చెరువుల్లో కుంటల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్లే భయపడుతున్నారని తెలిపారు. అనుమతులు ఉన్న వాళ్ళ జోలికి హైదరాబాద్ వెళ్లదన్నారు. అనుమతులు ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలో ప్రభుత్వానికి తెలుసని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోవాలని కొంతమంది కుట్ర దారులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. హైడ్రా అనగానే ఈటెల కేటీఆర్ హరీష్ లే బయటకు వచ్చారని.. పేదవాళ్ళు ఎవరు బయటికి రాలేదన్నారు. గండిపేట ఆక్రమించుకుంది ఎవరు? పేదవాలు వెళ్లి గండిపేటలో గుడిసెలు వేశారా? అని ప్రశ్నించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పేదవాళ్లు ఫామ్ హౌస్ లు కట్టుకోగలుగుతారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయడం వల్లనే డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేకపోతున్నామని చెప్పిన సన్నాసివి నువ్వే కదా.. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..
ఖర్చయిన భూములు గుంజుకొని.. పేదలకు పెంచాలని మేం చెబుతున్నామన్నారు. బీఆర్ఎస్ దొంగలకు పంచాలని దాచిపెట్టుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మూసిలో పేదలకి నేను పంచుతున్నా అన్నారు. పేదలకి ఆస్తులు పంచుతుంటే బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. బిల్లా రంగలు బుల్లోజర్ ఎప్పుడు వస్తుందో చెప్పండి అడ్డం పడుకుంటా అని చెప్తున్నారు.. బావ బామ్మర్దులు ఎప్పుడు వస్తారో చెప్పండి మా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని ఇచ్చి బుల్లోజర్ పంపుతా అన్నారు. మహేష్ గౌడ్ పిసిసిగా ఉన్నాడు కాబట్టి వద్దనుకుంటే.. బుల్డోజర్ నడిపే బాధ్యత మా హనుమంత్ అన్నకి ఇస్తా అన్నారు. బావ బామ్మర్దులవి దొంగ మాటలు.. లంగ నాటకాలు అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ఫామ్ అవదులు కాపాడుకోవడానికి ఇవన్నీ నాటకాలు ఎందుకు? అని ప్రశ్నించారు. మీ ఫామ్ హౌస్ దొంగదో మంచిదో చూద్దాం పద.. అన్నారు. అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా అంటున్న కేటీఆర్ కి.. ఎక్కడికో ఎందుకు నీ జన్వాడ ఫామ్ హౌస్ కి వెళ్దాం.. నాలాని ఆక్రమించుకున్నవా లేదా తేల్చుదం అన్నారు. త్రిబుల్ వన్ జీవన్ ఉల్లంఘించి 100 కోట్లతో పెద్ద భవనాన్ని నిర్మించుకోలేదా? అని ప్రశ్నించారు.
Tummala Nageswara Rao: వారికి రైతు భరోసా ఇవ్వలేము.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు