NTV Telugu Site icon

CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దు..

Cm Revanth Reddy Hydera

Cm Revanth Reddy Hydera

CM Revanth Reddy: ఒక్క నిమిషం కూడా కరెంట్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారబోతోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు.
సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖల్లో వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సోలార్ పంప్ సెట్ లను ఉచితంగా అందించి వారిని సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలన్నారు. కొండారెడ్డి పల్లెను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Read also: Sukanya Samriddhi Yojana: బిగ్ అప్డేట్.. సుకన్య సమృద్ధి యోజనలో రూల్స్ చేంజ్..

సోలాట్ పంప్ సెట్ ల ద్వారా వచ్చే మిగులు విద్యుత్ పై రైతుకు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వంటగ్యాస్ బదులుగా సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలన్నారు. అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ ఏటా 40వేల మెగావాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలన్నారు. ఓవర్ లోడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని అన్నారు. వినియోగదారులకు 24గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలన్నారు. వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది కలగనీయొద్దని తెలిపారు.
Nigeria : నైజీరియాలో బోకోహరమ్ ఉగ్రదాడి..100 మందికి పైగా మృతి

Show comments