NTV Telugu Site icon

MSME Policy: ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యాంశాలు ఇవే..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

MSME Policy: చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మాదాపూర్ శిల్పకళా వేదికగా ఎంఎస్‌ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

Read also: Tollywood : ప్రేక్షకుల అభిరుచి మారుతోంది.. ఇదే నిదర్శనం

అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం MSME పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Sangareddy: ఆకలి అంటే దొంగకు అన్నం పెట్టారు.. సంక్రాంతి సినిమాకు మించిన సీన్‌

Show comments