NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి..

Cm Revanth Reddy Hydera

Cm Revanth Reddy Hydera

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముంబై బయలుదేరనున్నారు. అక్కడి నుంచి రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపారు.. కాగా.. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ ముందు ముంబై వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్ర చేరుకుంటారని వెల్లడించారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంతో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడనున్నారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ శనివారం రాత్రికే రేవంత్‌ హైదరాబాద్‌ చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఇవాళ శనివారం ఉదయం జార్ఖండ్‌ బయలుదేరి వెళ్లనున్నారు.. శని, ఆదివారాల్లో అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఆదివారం రాత్రికి బట్టి విక్రమార్క హైదరాబాద్‌ తిరిగి రానున్నారు.
Astrology: నవంబర్ 09, శనివారం దినఫలాలు

Show comments