CM Revanth Reddy: ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు పర్యటన కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు పార్లమెంట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం అనంతరం పార్లమెంట్ లోనే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో, మంత్రివర్గ విస్తరణ పై చర్చకు వచ్చే అవకాశం ఉందిని తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణ పై ఢిల్లీ టూర్ లో క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విస్తరణపై ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఢిల్లీ టూర్ లో క్యాబినెట్ విస్తరణ పై హై కమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటి ఉండే అవకాశం ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో సీఎం సహా 11 మంది మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ ఉంటే మరో ఆరుగురికి చోటు దక్కే ఛాన్స్ ఉంటుంది.
Read also: Bhoodan Land Scam: భూదాన్ భూముల స్కామ్.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు..
తెలంగాణలో ఏడాది పరిపాలన పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్. ఇక క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఉంటుందా? అనే దానిపై ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. కేబినెట్‌లో చోటు కోసం నేతలు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో పాటూ, రాష్ట్రంలోని ముఖ్యనేతలను కలిసి మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నట్లు సమాచారం.
ఆశావాహాల్లో ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, మదన్‌మోహన్‌రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ లు ఉన్నారు. క్యాబినెట్ విస్తరణ ఉంటే, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కచ్చితంగా అవకాశం ఉంటుందంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే అధిష్టాన పెద్దలకు మల్ రెడ్డి రంగారెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్, రంగారెడ్డిలో తాను ఒక్కడినే గెలిచానంటూ, క్యాబినెట్‌లో అవకాశం ఇవ్వాలని మల్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Uttam Kumar Reddy: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన..