Site icon NTV Telugu

CM Revanth Reddy: నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు సీఎం.. షెడ్యూల్‌ ఇదీ..

Cm Revanth Reddy Hydera

Cm Revanth Reddy Hydera

CM Revanth Reddy: నేడు ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు. గత మూడురోజులుగా జైపూర్, ఢిల్లీ పర్యటన అనంతరం ఇవాళ హైదరాబాద్ కు సీఎం బయలుదేరారు. ఇవాళ హైదరాబాద్ చేరుకోగానే.. మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి చిల్కూర్ లోని టీజీ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ స్కూల్​ను సందర్శించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్లాన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కోకాపేటలో దొడ్డి కొమురయ్య కుర్మ భవన్​ ప్రారంభించనున్నారు.

Read also: Fake Currency Gang: నకిలీ నోట్ల ముఠాను పట్టించిన ఏటీఎం..!

నేటి నుంచి గురుకులాల్లో ప్రభుత్వం పర్యటించనుంది. ముఖ్య అధికారులతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు గురుకులాలను సందర్శించనున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితులను స్వయంగా పరిశీలించి అంచనా వేస్తారు. భవిష్యత్తులో చేపట్టే విద్యార్థుల సంక్షేమం, గురుకులాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈరోజు అన్ని గురుకులాల్లో ఉమ్మడి ఆహారం ప్రారంభించనున్నారు. గురుకులాల్లో పరిస్థితులను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసేందుకు ప్రభుత్వ పెద్దలంతా ఇవాళ తరలిరానున్నారు. రాష్ట్రంలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సందర్శించనున్నారు.
Champions Trophy: భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ అక్కడే.. నేడే షెడ్యూల్ విడుదల!

Exit mobile version