Singareni Dasara Bonus: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయమైన లాభాలు సాధించే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ.3 వేల కోట్ల లాభాలు రాబోయే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది (2023-24)లో సింగరేణి రూ.2,412 కోట్ల లాభాలను అందుకుంది. అందులో 33 శాతం మేరకు రూ.796 కోట్లను కార్మికులకు లాభాల వాటా రూపంలో తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈసారి లాభాలు మరింత పెరగనున్న నేపథ్యంలో, కార్మిక సంఘాలు లాభాల వాటా శాతం కూడా పెంచాలని రాష్ట్ర సర్కార్ ను కోరుతున్నాయి. ముఖ్యంగా, 35 శాతం లాభాలను కార్మికులకు కేటాయించాలని సింగరేణి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: New GST: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. అమల్లోకి జీఎస్టీ 2.o.. వీటి రేట్లు తగ్గాయి..
అయితే, లాభాల శాతం పెరిగితే దాదాపు రూ.900 కోట్ల వరకు కార్మికులకు లాభాల వాటా పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ నేడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఉదయం 11 గంటలకి సింగరేణి కార్మిక సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.
