Site icon NTV Telugu

CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్‌ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి

Cm Revanth Reddy Assembly 2024

Cm Revanth Reddy Assembly 2024

CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్ తెచ్చినట్టు ఎంతకాలం ఉదార కొడతారు? అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఒప్పందాల విషయంలో సత్యహరిశ్చంద్రుడి తరువాత కేసీఆరే అన్నట్లు వారు మాట్లాడారు. ఛత్తీస్ ఘడ్, యాదాద్రి , భద్రాద్రి ఒప్పందాలపై వారే విచారణకు అడిగారని తెలిపారు. వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించామని తెలిపారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్ పైనే ఆరోపణలు చేశారన్నారు. విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పింది.. కానీ కొత్త కమిషన్ చైర్మన్ ను నియమించాలని చెప్పిందని అన్నారు. విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను ఇవాళ సాయంత్రంలోగా నియమిస్తామన్నారు. తెలంగాణకు వాళ్లే ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

Read also: Rajanna Sircilla Crime: భార్యను చంపి.. ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య..?

వైఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ తెలిపారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ ఆస్తులు సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందన్నారు. కానీ ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన విభజన జరగాలని ఆనాడు జైపాల్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించారని తెలిపారు. రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని అన్నారు. 53.46 శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లు కమ్మకుండా చేశారని అన్నారు. ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయండని ఆదేశించారు. ఆనాడు నేను సభలో మాట్లాడితే నన్ను సభ నుంచి మార్షల్స్ తో బయటకు పంపించారని తెలిపారు. సోలార్ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెబుతున్నారు… అవి ప్రయివేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు.

Read also: Raj Gopal Reddy: యాదాద్రి పవర్ ప్లాంట్ ఆలోచన ఆయనదే..

వీళ్ల ఏలుబడిలో సోలార్ పవర్ కేవలం ఒక మెగావాట్ మాత్రమే అన్నారు. పవర్ ప్లాంట్స్ కు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టు విషయంలో వీళ్ల తెలివి ప్రదర్శించారని అన్నారు. గంపగుత్తగా బీహెచ్ఎల్ కాంట్రాక్టు అప్పగించారన్నారు. బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్స్ మొత్తం వీళ్ల బినామీలు, బంధువులు, అనుయాయులకు ఇచ్చారు. అందులో వేలకోట్ల ఫ్రాడ్ జరిగిందని తెలిపారు. విచారణలో అంతా బయటపడుతుందనే ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు. 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు టెండర్ వేస్తే సూపర్ క్రిటికల్ టెండర్ పిలిస్తే కొరియన్, బీహెచ్ఈఎల్, మరో కంపెనీ పాల్గొన్నాయని తెలిపారు. అక్కడ 18శాతం లెస్ కు బీహెచ్ఈఎల్ పనులు దక్కించుకున్నారు. ఇక్కడ కూడా 18శాతం లెస్ కు పనులు చేసే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టును నామినేషన్ పై బీహెచ్ఈఎల్ కు అప్పగించారని తెలిపారు. అందులో దాదాపు 8వేల కోట్లు కుంభకోణం జరిగిందన్నారు.

Read also:Organs Donated: చనిపోయిన కూడా పది మందికి జీవితాల్లో వెలుగులు నింపిన యువతి..

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో గుజరాత్ లోని ఇండియా బుల్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించాలని చట్టంలో ఉన్నా ఉల్లంఘించారు. ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదన్నారు. వీళ్ల నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. వారి కోరిక మేరకే విచారణ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్ పై ఆరోపణలు చేశారన్నారు. కావాలన్నది వాళ్లే… సెగ తగలగానే వద్దన్నది వాళ్లే.. తిన్నింటి వాసాలులేక్కబెట్టే లక్షణాలు మాకు లేవన్నారు. మీ వాదన ఏంటో కమిషన్ ముందు చెప్పండని ప్రశ్నించారు. సాయంత్రానికల్లా విచారణ కమిషన్ కు కొత్త చైర్మన్ ను నియమిస్తామన్నారు.

Srisailam Dam: పర్యటకులకు అలర్ట్‌.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్‌ గేట్లు ఎత్తివేత..

Exit mobile version