NTV Telugu Site icon

CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..

Jagadesh Reddy Revanth Reddy

Jagadesh Reddy Revanth Reddy

CM Revanth Reddy: ఆగస్టు 1, 2న బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్దమని జగదీష్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మీరెంత అబద్ధాలు చెబితే నేను అంత నిజాలు చెబుతా అన్నారు. అబద్దాలు చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. విద్యుత్ పై మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విచారణ కమిషన్ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు కోర్టుకు వెళ్లారని తెలిపారు. అందుకు చైర్మన్ వైఖరిని కారణంగా చూపారని అన్నారు. కమిషన్ ను రద్దు చేయడం కుదరదని.. చైర్మన్ పై అభ్యంతరం ఉంటే చైర్మన్ ను మార్చాలని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. కోర్టు కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిందన్నారు. 2015 లో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును రూ.7,290 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారని తెలిపారు.

Read also: Revanth Reddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డిల మధ్య డైలాగ్‌ వార్‌..

2017 లో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారని.. కానీ అది 2022లో పూర్తి చేశారు.. ప్రాజెక్టు వ్యయం రూ.10,515 కోట్లకు పెంచారని తెలిపారు. భద్రాద్రి ద్వారా ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ.9కోట్ల 73లక్షలు పడుతోందన్నారు. 25వేల కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించారని తెలిపారు. 2020లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కానీ 2024 వచ్చినా ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. కానీ అంచనా వ్యయం రూ.34,548 కి పెరిగిందని.. ఇది భవిష్యత్ లో రూ.40వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. దాదాపు 10వేల కోట్లు యాదాద్రిలో అంచనాలు పెంచారు.. అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయని అన్నారు. ఎన్టీపీసీ ద్వారా పర్ మెగావాట్ ఉత్పత్తికి 7కోట్ల 38లక్షలు, యాదాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా మెగావాట్ ఉత్పత్తికి 8కోట్ల 64 లక్షలు అవుతోందన్నారు. వీళ్లు ఎన్టీపీసీకి ధోఖా చేస్తే… ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతించింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కావాలంటే రికార్డులు ముందు పెడతామన్నారు. 2015 లో వాళ్లు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు 2023 లో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను సాకుగా చెబుతున్నారని అన్నారు.

Read also: Komatireddy Vs Jagadish Reddy: అసెంబ్లీలో మాటల మంటలు.. జగదీష్ రెడ్డి వర్సెస్‌ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి

సభను, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం చేసింది మీరు అని మండిపడ్డారు. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? అని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు వలసలపై ఆనాడు నేను అసెంబ్లీలో మాట్లాడా అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పై నేను అసెంబ్లీలో ఎంత మాట్లాడానో… కేసీఆర్ పార్లమెంట్ లో ఎంత మాట్లాడారో రికార్డులు తీయండి అని అన్నారు. ఇతరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చింది వీళ్లు.. జర్నలిస్ట్ పై కేసు పెట్టామని చెబుతున్న వీళ్లు… వారి పాలనలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఆమె చానల్ ను గుంజుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఆ జర్నలిస్ట్ పై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డలను జైల్లో పెట్టినందుకే ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారు. ఆనాడు నన్ను జైల్లో పెట్టినా నేను భయపడలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: తెలంగాణకు వాళ్ళేదో కరెంట్‌ తెచ్చినట్టు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి