NTV Telugu Site icon

CM Revanth Reddy: ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సదస్సును ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ లో AI రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నాలుగో నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా  మొదలు కొని ఇప్పుడు AI కి వచ్చామన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందన్నారు.

Read also: Best Teacher Awards: నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం..

ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఇతర పరిజ్ఞానం కి చెందిన వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన AI రోడ్ మ్యాప్ లో 25 కార్యక్రమాలను ప్రభుత్వం పొందుపరిచింది. ప్రపంచం నలుమూలల నుండి 2,000 మంది వ్యక్తులు, కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ తరహా ఏఐ సదస్సు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోంది. సమాజంపై AI ప్రభావాన్ని నియంత్రించడం, సవాళ్లను సదస్సులో చర్చించనున్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు AI గ్లోబల్ సమ్మిట్ కొనసాగనుంది. “Making AI work for every one” అనే థీమ్ తో సదస్సు నిర్వహణ చేపట్టారు.
IRCTC Update: ఇకపై ఫోన్ కాల్‌తో రైలు టిక్కెట్‌ బుకింగ్.. వాయిస్‌తో చెల్లింపులు..