NTV Telugu Site icon

CM Revanth Reddy: మెగాస్టార్ చిరంజీవి సందేశం.. వీడియో విడుదల చేసిన సీఎం రేవంత్..

Cm Revanth Reddy Chiranjeevi

Cm Revanth Reddy Chiranjeevi

CM Revanth Reddy: సినిమా ఇండస్ట్రీ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాలపై మెగాస్టార్ చిరంజీవి ఉచితంగా నటించి వీడియోను విడుదల చేశారు. చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన నటీనటులందరూ కూడా ఆయన బాటలో నడవాలని సూచించారు. మదకద్రవ్యాల నియంత్రణకు సినిమా ఇండస్ట్రీ కూడా కృషి చేయాలన్నారు. సినిమా రిలీజ్ ల సమయంలో టికెట్ల ధరలపై కాకుండా.. ఆ సినిమాలో నటించే నటీనటుల ద్వారా మాదకద్రవ్యాలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండేలా ఒక ప్రోమో క్రియేట్ చేసి వాటిని థియేటర్లో టెలికాస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టికెట్లను పెంచి వ్యాపారం చేసుకోవడం ఎలా వ్యాపారం చేస్తున్నారో, సమాజాకి బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.

Read also: Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?

రాష్ట్రంలో ఉన్న అన్ని థియేటర్ల యాజమాన్యం తప్పకుండా సినిమా ప్రారంభానికి ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్ వాడకం పై అవగాహన కల్పించే రీల్స్ ని ఉచితంగా ప్రదర్శించాలని కోరారు. అలాంటి థియేటర్ల వారికే ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర క్రీడాకారులు కూడా ఇలాంటి వాటిపై అవగాహన కల్పించే విధంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా ఏర్పాటు చేసిన వాల్ బోర్డు పై మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ రెడ్డి రాశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐపీసీలో తీసుకొచ్చిన మార్పులను స్వాగతిస్తున్నామన్నారు. ఈరోజు గల్లీ గల్లీలలో గంజాయి దొరికే పరిస్థితిలో వచ్చాయని తెలిపారు. వీటిని నియంత్రించడానికి అధికారులకు సంపూర్ణ అధికారం ఇచ్చామన్నారు. అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించామని తెలిపారు. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పేద, మధ్యతరగతి పిల్లలు గంజాయికి బానిసలుగా మారి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

Read also: Revanth Reddy: డ్రగ్స్ పై యుద్ధం.. సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్ ?

చిన్న పిల్లలపై జరుగుతున్న దాడుల వెనక గంజాయి మత్తులోనే జరుగుతున్నట్లుగా అర్థమవుతుందని సీఎం అన్నారు. ఈ నేరాలు నియంత్రించి, తెలంగాణ సమాజంలో యువతలో పోరాట స్పూర్తి తిరిగి నింపే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల కేసులను సమర్థవంతంగా నియంత్రించాలన్నారు. మాదాక ద్రవ్యాల నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే అధికారులకు ప్రమోషన్స్ తో పాటు సైబర్ క్రైమ్ లో నైపుణ్య ప్రదర్శించి, నేరగాళ్ళను పట్టుకున్న వారికి ఇతర మదకద్రవ్యాల రాకెట్లను పట్టుకున్న అలాంటి అధికారులకు నగదు బహుమతితోపాటు పదోన్నతి కూడా కల్పించడానికి అవసరమైన విధి విధానాలను రూపొందించాలంటూ డీజీపికి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ముఠాలు, సైబర్ క్రైమ్ కీటకాలు అడుగు పెట్టాలంటే భయపడాలన్నారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే బాధితులతో ఫ్రెండ్లీగా ఉండాలి కానీ నేరాలతో ఫ్రెండ్లీగా కాదన్నారు. అలా వ్యవహరిస్తే సమాజంలో డిపార్ట్మెంట్ పై నమ్మకం సన్నగిల్లుతుందని సీఎం రేవంత్ తెలిపారు.
Hairfall : మీ జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి