NTV Telugu Site icon

CM Revanth Reddy: సీతారామ ప్రాజెక్టు ప్రారంభం.. గోదావరి జలాలకు సీఎం ప్రత్యేక పూజలు..

Cm Revanth Reddy Seetaram Projuct

Cm Revanth Reddy Seetaram Projuct

CM Revanth Reddy: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే సీతారామ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పంప్‌హౌస్‌-2ను సీఎం రేవంత్‌రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి గోదావరి నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టువస్త్రాలు వదిలారు. కాగా, ఈ పథకం కింద దాదాపు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అక్కడి నుంచి అనంతరం వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. అదేవిధంగా ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌస్-3ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. మరోవైపు అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామ పంప్ హౌస్-1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు.

Read also: Independence Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఈరోజు రుణమాఫీ ఫైనల్ ఫేజ్‌ ప్రారంభించిన అనంతరం రాత్రికి హస్తినకు బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే రెండు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్ కాన్, యాపిల్ కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మరోవైపు శుక్రవారం కాంగ్రెస్‌ హైకమాండ్‌తో రేవంత్‌ భేటీ కానున్నారు. ఆగస్టు 15న రైతుల రుణమాఫీ పూర్తయిన తర్వాత వరంగల్‌లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞతా సభకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించనున్నారు.అదే విధంగా సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సోనియాను రేవంత్ ఆహ్వానించనున్నారు.తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్‌పై ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..