NTV Telugu Site icon

CM Revanth Reddy: మహిళల కోసం భవిష్యత్తులో మరిన్ని ఆసుపత్రులు..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.పింక్ పవర్ రన్ విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మేఘా కృష్ణా రెడ్డి, సుధా రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తుందన్నారు. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని శుభవార్త చెప్పారు. గచ్చిబౌలి స్టేడియం సాక్షిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ లో భాగంగా మెయిల్ ఆధ్వర్యంలో సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా మారతాన్ నిర్వహించారు. మారతాన్ అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేశారు. సీఎం రేవంత్ సమక్షంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు…

హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమాన్ని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. 3K, 5K మరియు 10K పరుగులు ఏకకాలంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడం, క్యాన్సర్‌ను ముందుగా గుర్తించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తిస్తే సరైన చికిత్సతో మహమ్మారిని తరిమికొట్టవచ్చని చెప్పారు. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ 2024 నిర్వహించారు.
Tamilnadu: భారీ వర్షాలు.. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!