NTV Telugu Site icon

CM Revanth Reddy: అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దు.. టెలి కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌..

Revatnh Reddy

Revatnh Reddy

CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి అత్యవసర టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

Read also: GHMC Commissioner: నగరంలో రెడ్ అలెర్ట్.. ప్రజలకు ఆమ్రపాలి సూచన..

అధికారులెవరూ సెలవు తీసుకోవద్దని సీఎం రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని రేవంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అవసరం ఉంటే అధికారులకు ఫోన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక రాజధాని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. పట్టణాలు, నగరాల్లోని రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమై ఇళ్లు జలమయమయ్యాయి. గ్రామాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్నలు నీటమునిగాయి.
Big Boss 8: బిగ్ బాస్ సీజన్ -8 ఫైనల్ 14 కంటెస్టెంట్స్ వీళ్ళే..

Show comments