NTV Telugu Site icon

CM Revanth Reddy: బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం..

Cm Revatnh Reddy

Cm Revatnh Reddy

CM Revanth Reddy: గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీపీ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన The southern Rising Summit 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సదస్సును ప్రారంభించి తన విజన్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉందన్నారు. పటేల్ విగ్రహంలా… బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామనిత తెలిపారు. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని స్పష్టం చేశారు. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? అని సీఎం ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారతానికి చెందిన రాజకీయ, పారిశ్రామిక, సినీ ప్రముఖులు, రచయితలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.

KTR in Sircilla: నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన.. విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ చర్చ..

ABP నెట్‌వర్క్. దేశంలోని అనేక భాషల్లో మీడియా హౌస్‌లను నిర్వహిస్తున్న ABP NETWORK, భారతదేశ వృద్ధి కథనంలో దక్షిణ భారతదేశం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి సమావేశాలను నిర్వహిస్తుంది. సౌత్ ఇండియా విజయాన్ని పురస్కరించుకుని, ద సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024 హైదరాబాద్‌లో కొనసాగుతుంది. దేశ పురోగమనంలో దక్షిణ భారతదేశం ప్రాముఖ్యతను, అందులో ఈ వ్యక్తుల పాత్రను ఈ సదస్సు విశ్లేషించనుంది. “ద సదరన్ రైజింగ్ సమ్మిట్” మరోసారి జాతీయ సందర్భంలో దక్షిణాది ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించింది. సమ్మిట్ కీలకమైన రాజకీయ, సాంస్కృతిక, విద్యా, ఆరోగ్య సంరక్షణ, దక్షిణాది విశిష్టతను నిలబెట్టుకోవడంపై ప్రభావవంతమైన చర్చలను కలిగి ఉంటుంది. అలాగే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన అంశాలపై ప్రముఖులు తమ ఆలోచనలను పంచుకుంటారు.
Sai Pallavi: బాలీవుడ్‌పై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి!

Show comments