Sitarama Project: దశాబ్దాల సాగు నీటి కల సాకారం.. సీతారామ ప్రాజెక్ట్ కు సీఎం రేవంత్ ప్రారంభోత్సవం..
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు..
- దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసే సీతారామ ప్రాజెక్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sitarama Project: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. దశాబ్దాల సాగునీటి కలను సాకారం చేసే సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెంలో పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. పంప్ హౌస్ మోటార్లను సీఎం రేవంత్ ఆన్ చేసి డెలివరీ సిస్టర్న్ వద్ద గోదారమ్మకు పూజలు చేయనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెలికాప్టర్‌లో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకుంటారు.
Read also: DSC Recruitment Process: సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ..?
Also Read
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌లను ప్రారంభించిన అనంతరం వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ను రెండు రోజుల క్రితం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 11న పూసుగూడెం, కమలాపురం పంపుహౌస్‌లను మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ -2 ట్రయల్ రన్ ను మంత్రులు ప్రారంభించారు.
Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..