CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ లో నా కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ నాతో కలిశారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ నాతో పొత్తు పెట్టుకుంటానని.. నాకు జైల్లో కలిసి చెప్పారన్నారు. ఆ తరువాత బీజేపీ కూడా మాతో కలిసిందన్నారు. అందరి కలయికతో అధికారం చేపట్టామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి రైళ్లలో బస్సుల్లో వచ్చి ఓట్లు వేశారని తెలిపారు. కొందరు ఇతర దేశాల్లో ఉన్న వారు కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటు వేశారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న భూతాన్ని భూస్థాపితం చేస్తామని తెలిపారు. అక్కడ రాష్ట్ర ఖజానా లేదు.. అంతా కాళి చేసి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభంలో ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసన్నారు. అప్పుడు నేను కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండే.. కానీ మళ్ళీ ఆ పరిస్థితి మార్చానని తెలిపారు.
Read also: CM Chandrababu: రేవంత్ రెడ్డిని అందుకే కలిసాను.. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు..
కొంత మంది మీడియా మా పై భూచిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీడియా కూడా కలిసి పని చేస్తే సమస్యలు తీరుతాయన్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్య మంత్రి గా చేశానని గుర్తు చేసుకున్నారు. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో కమిటీలు వేసి నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. అదిలాబాద్ మొదలు శ్రీకాకుళం వరకు నేను తిరగని ప్రాంతం లేదన్నారు. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు.. దానికి సేవాభావంతో అభివృద్ధి చేశానన్నారు. నా చివరి బొట్టు వరకు ప్రజా సేవ చేస్తానని తెలిపారు. వచ్చే 30 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఒక విజన్ ఆలోచిస్తానని అన్నారు. ఈ సారి యువకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చానని అన్నారు. తెలుగు దేశం చరిత్రలో ఇదే ఇంత పెద్ద విజయం అన్నారు. ఒక సునామీలా వచ్చిన ఈ విజయానికి చాలా మంది కొట్టుకు పోయారన్నారు. ప్రజా స్వామ్యంలో రాజులు లేరు.. నియంతలు లేరన్నారు.
CM Revanth Reddy: జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..