Chamala Kiran Kumar Reddy: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన లేఖపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాహుల్ కు కేటీఆర్ ఉత్తరం రాసేదేందని ప్రశ్నించారు. రాహుల్ కు రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తెలుసన్నారు. రాహుల్ కు కేటీఆర్ రాసిన లేఖ హాస్యాస్పదం అన్నారు. అనంతరం ఎంపీ చామల మాట్లాడుతూ.. ఇవాళ ఢిల్లీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఎంపీల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ముగిసిందని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ అయ్యామని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై ఎంపీలుగా, మాకు అవగాహన అవసరమని అన్నారు.
Read also: Telangana Secretariat: నేటి నుంచి సెక్రటేరియట్‌లో అటెండెన్స్.. లేటుగా వస్తే లాసేనా..
డిప్యూటీ సీఎంతో అన్ని అంశాలపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతోంది.. అమలు చేస్తోన్న అన్ని అంశాలపై స్పష్టత ఇచ్చారని తెలిపారు. ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు అన్నిటిని తెలియజేశారని అన్నారు. అన్ని మంచి కార్యక్రమాలను చేపట్టాం, ఎంపీలు సైతం ప్రచారంలో భాగస్వామ్యం కావాలని చెప్పారని చామల కిరణ్ తెలిపారు. అప్పుల రాష్ట్రానికి అధికారంలోకి వచ్చాం, మెస్ చార్జీలు, రైతు రుణమాఫీ, కరెంటు, సిలిండర్, ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రాహుల్ కు కేటీఆర్ రాసిన లేఖ హాస్యాస్పదమని, కేసిఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన మమ్మల్ని చూసి, ఓర్వలేక ప్రతి రోజు విషం కక్కుత్తున్నారని మండిపడ్డారు.
Read also: Bengaluru Techie: పురుషుల రక్షణకు కూడా చట్టాలు కావాలి.. లేదంటే కోర్టులపై నమ్మకం పోతుంది!
తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి కేటీఆర్ ఉత్తరం రాసేదేంది అని ప్రశ్నించారు. రాహుల్ కు రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ తెలుసని అన్నారు. అప్పుల కోసమే ప్రతి నెలా ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంద.. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు వచ్చేలా పని చేస్తున్నామని ఎంపీ తెలిపారు. చిత్తశుద్ధి ఉండి పరిపాలన అందిస్తుంటే ఓర్వలేక.. అపోజిషన్ లీడర్ గా ఉండి అసెంబ్లీకి రాని దద్దమ్మలు మాకు సూక్తులు చెప్పడమా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో ఉన్న పంచాయతీల్లో ఎవరు గొప్పో తేల్చుకోలేక వాళ్ళకి నిద్ర పట్టట్లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కోసం ప్రజలకు మంచి చేయడం కోసం పనిచేస్తున్నామన్నారు. మంచి పనులు చేస్తాం, మళ్ళీ మళ్ళీ గెలుస్తామన్నారు.
Over Sleeping: మహిళలు అతిగా నిద్రపోతున్నారా.. సంతాన సామర్థ్యం తగ్గే అవకాశం..