NTV Telugu Site icon

Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్‌ ఏమైనట్టు..?

Riyaz Murder In Old City

Riyaz Murder In Old City

Hyderabad Crime Update: బాలాపూర్ గ్యాంగ్ స్టర్ మెంటల్ రియాజ్ హత్య కేసులు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. ఆరు హత్య కేసులో మృతుడు రియాజ్ కు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. కాంచనబాగ్ పోలీస్ స్టేషన్ లో రియాజ్ పై 2004 లోనే రౌడీషీట్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు తెలిపారు. 2013 లో గ్యాంగ్ స్టర్ అయుబ్ ఖాన్ బామ్మర్ది ఫజల్ అనే రౌడీ షీటర్ ను హతమార్చిన కేసులో రియాజ్ ప్రమేయం ఉండటంతోనే రియాజ్ పై కాల్పులు జరపారని పోలీసులు బావిస్తున్నారు. నిన్న రాత్రి రౌడీషీటర్ ఛాకు నజీర్ తో కలిసి బాలాపూర్ సప్తగిరి బార్ లో రియాజ్ మద్యం సేవించినట్లు నిర్ధారించారు. అనంతరం ఆర్ సీఐ రోడ్డు వద్దకు రాగానే ప్రత్యర్ధులు రియాజ్ పై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. రియాజ్ పై మూడు రౌండ్లు కాల్పులు జరిపి, తలపై రాడ్లతో దాడి చేసి హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు. ముగ్గురు అనుమానితులను పోలీసుల అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.

Read also: Telangana is a Future State: ట్యాగ్​ లైన్​ ఖరారు చేసిన సీఎం రేవంత్​ రెడ్డి..

చాకు నజీర్ ఏమైనట్టు..?

ఇదంతా సరే.. మరి నిన్న రాత్రి రౌడీషీటర్ చాకు నజీర్ తో కలిసి రియాజ్ మద్యం సేవించినట్లు తెలిసిందే. అయితే రియాజ్ పై ప్రత్యర్థులు కాల్పులు జరుపుతున్నప్పుడు చాకు నజీర్ ఏమైనట్టు? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటలకు చాకు నజీర్ తో రియాజ్ వున్నట్లు ప్రత్యర్థులకు ఎలా తెలిసింది?. రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు వున్నట్లు సమాచారం. రియాజ్ తో చాకు నజీర్ కు గొడవలు వున్న తనతో స్నేహంగా ఎందుకు వున్నాడు? అయితే ఫజల్ అనే రౌడీ షీటర్ మర్డర్ కేసులో మృతుడు రియాజ్ A5 గా నిందితుడుగా వున్నట్లు సమాచారం. ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య వల్లే నజీర్ గ్యాంగ్ రియాజ్‌ ను టార్గెట్‌ చేసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాత కక్షలుగా అనుమానిస్తున్నారు. రియాజ్‌ ను చంపింది నజీర్‌ గ్యాంగ్‌ గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి ఆధారాలు ఇంకా తెలియాలని అన్నారు. అనుమానితును ముగ్గురిని అదుపులో తీసుకున్న పోలీసులు మరి ఛాకు నజీర్ ను ఎందుకు అదుపులో తీసుకోలేదు?. రియాజ్ ను చంపుతున్నప్పుడు నజీర్ అక్కడి నుంచి పారిపోయాడా? పోలీసులు అదుపులో తీసుకున్న ఆ ముగ్గురిలో చాకు నజీర్ ఉన్నాడా? కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కేసుపై వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
IT Minister Sridhar Babu: ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా హైదరాబాద్..

Show comments