NTV Telugu Site icon

Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్‌

Panjagutta

Panjagutta

Hyderabad: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించింది. కారు చెకింగ్ సమయంలో డ్రైవర్‌ కారు ఆపకుండా దూసుకెళ్ళిపోయాడు. కారు బ్లాక్ ఫిల్మ్ చెకింగ్ లో భాగంగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఇవాళ ఉదయం తనిఖీలు చేపట్టారు. వాహనాలను చెకింగ్‌ చేస్తూండగా ఓ కారు డ్రైవర్‌ ను పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద కారు చెక్ చేయడానికి హోంగార్డ్ రమేష్ కారును ఆపాడు. కారు ఆపకుండా డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ అనే వ్యక్తి హోం గార్డు రమేష్ నీ ఈడ్చుకెళ్లి పోయాడు. ట్రాఫిక్ పోలీసులకు భయపడిన కారు డ్రైవర్ ఆపకుండా దూసుకెళ్లాడు. దీంతో.. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కారు డ్రైవర్‌ ను అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కారు ఎక్కడి నుంచి వచ్చింది? కారును ఎందుకు ఆపకుండా వెళ్లిపోయాడు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నా పోలీసులు. డ్రైవర్ సయ్యద్ మాజుద్ధిన్ నసిర్ ను వెంటనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన హోం గార్డు రమేష్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
Nikhil : ఒకప్పుడు 100కోట్ల హీరో.. ఇప్పుడు కనీసం ఓపెనింగ్స్ లేవా ?

Show comments