Fake Love: జీవితం సినిమా కాదు. అది ఒక రెండున్నర గంటల సినిమా మాత్రమే. దాన్ని చూసి యువత అదే జీవితం అనుకుని పరుగులు పెడుతుంటారు. తెలిసి తెలియని వయస్సులో సినిమాలోని హీరో హీరోయిన్‌ల బతికేయొచ్చు కదా అనుకుని ప్రేమే ప్రపంచం అనుకుంటారు. ఎవరైనా ప్రేమిసున్నానని వెంట బడితే చాలు నిజమని నమ్మేస్తారు. మన ప్రేమకు మతం అడ్డువస్తుందంటే.. మతం కూడా మార్చుకుంటారు. ప్రేమ కంటే మతం ముఖ్యం కాదనుకుంటారు.
Read also: Amit Shah: రేపటి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన.. నక్సల్స్ వ్యతిరేక చర్యలపై సమీక్ష
తల్లిదండ్రుల ప్రేమకంటే ముక్కు మొహం తెలియని వారి ప్రేమే ఎక్కువని గుడ్డిగా నమ్మేస్తారు. ప్రేమ అనే ఒక్క పదంతో కళ్లు మూసుపోతాయి. కానీ అన్నీ కోల్పోయిన తర్వాతే కళ్లు తెరుస్తారు. అప్పుడు చేయడానికేమీ ఉండదు. జీవితంలో తప్పులు దిద్దుకోవడానికి కూడా ఉండదు. అలాంటి పరిస్థితే ఓ ప్రేమికురాలు ఎదురైంది. అన్నీ తానేనని నమ్మింది. తనకోసం మతం కూడ మార్చుకుంది. అయితే ఆ యువకుడు ఆ యువతిని నమ్మంచి వంచించాడు.. సహజీవనం చేసి పరారయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మధురానగర్‌లో చోటుచేసుకుంది.
Read also: OCTOPUS Mock Drill: శ్రీశైలం డ్యామ్ వద్ద అర్ధరాత్రి ఆక్టోపస్ మాక్ డ్రిల్
ఏం జరిగిందంటే..
హైదరాబాద్ లోని మధురానగర్ లోని పోలీస్టేషన్ పరిధిలో ఓ యువతి బ్యూటిషయన్ గా సిర్థ పడింది. ఆమె స్వస్థలం వైజాగ్. ఆమెతో ఓ క్యాబ్ డ్రైవర్ పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అయితే పెళ్లి ప్రస్తావన రాగానే క్యాబ్ డ్రైవర్ ప్లేట్ ఫిరాయించాడు. ఇద్దరు మతాలు వేరే మరి పెళ్లంటే ఇంట్లో వారు ఒప్పుకోరు అన్నారు. దీంతో అతని మాటలు నమ్మని యువతి ప్రేమికుడి కోసం మతం కూడా మార్చుకుంది. అయితే కొద్ది రోజులు ఆమెతో సహజీవనం చేసిన క్యాబ్ డ్రైవర్ ఆమె వద్ద నుంచి డబ్బులు కావాలని లక్షల్లో తీసుకున్నాడు.
Read also: Gabba Test: గబ్బాలో పేస్, బౌన్స్.. టీమిండియాకు పరీక్ష తప్పదు! 61 టెస్టుల్లో ఏడు సార్లు మాత్రమే
జీవితం పంచుకునే వ్యక్తే కదా అని అతను అడినన్ని డబ్బులు ఇస్తూ వచ్చింది. చివరకు ఆ క్యాబ్ డైవర్ ఆమె వద్ద వున్న డబ్బులతో తీసుకుని ఉడాయించాడు. మోసపోయినట్లు గుర్తించిన యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా వాడుకోవడంతో పాటు లక్షలాది రూపాయలు తీసుకుని వెళ్ళాడని పోలీసుల ముందు వాపోయింది. తనకు న్యాయం చేయాలని కన్నీరుమున్నీరుగా విలపించింది. కేసు నమోదు చేసిన మధుర నగర్ పోలీసులు క్యాబ్ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.