Mallareddy: హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బోయిన్‌పల్లిలోని వారి నివాసంలో వేడుకలు చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా తన సతీమణికి రంగులు పూశారు మల్లారెడ్డి.. అలాగే, తన మనుమరాళ్లను ఎత్తుకుని మాస్ డ్యాన్స్ చేశారు. డప్పు కొడుతూ అక్కడ ఉన్న వారందరిలో జోష్ నింపారు. ఇక, తనదైన శైలిలో స్టేప్పులు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు. కాగా, ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మల్లారెడ్డినా మాజాకానా అంటూ ఎక్స్ వేదికగా రిట్వీట్లు చేస్తున్నారు.
Mallareddy: హోలీ వేడుకల్లో మాజీమంత్రి మల్లారెడ్డి మాస్ డ్యాన్స్..
- మల్లారెడ్డి నివాసం వద్ద అంబరాన్నంటిన హోలీ సంబరాలు..
- కుటుంబ సభ్యులతో కలిసి హోలీ ఆడిన మాజీమంత్రి మల్లారెడ్డి..
- హోలీ సెలబ్రేషన్స్ లో డ్యాన్స్ లతో అలరించిన మామ అల్లుడు..
- మాస్ స్టెప్పులతో ఎంజాయ్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి..

Mallareddy