NTV Telugu Site icon

BRS MLA Mahipal Reddy: ఈడీ ఎదుట హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

Gudam Mahipal Reddy

Gudam Mahipal Reddy

BRS MLA Mahipal Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. మైనింగ్ కేసులో ఆయనపై ఈడీ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లలో ఈడి సోదాలు చేపట్టారు. రెండు రోజులపాటు మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 300 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లే విధంగా చేశారని ఈడీ అభియోగాలు మోపింది. గత వారం రోజుల క్రితం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తో పాటు సోదరుడి ఇంట్లో ఈడి సోదాలు నిర్వహించారు.

Read also: Minister Nimmala Ramanaidu: నిపుణుల నివేదిక ఆధారంగా పోలవరంపై కార్యాచరణ

మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టాలని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం కొనసాగించారని తెలిపింది. 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించింది ఈడీ. మైనింగ్ లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్ తో పాటు వినామీ పేర్లతో వ్యాపారాలు కొనసాగించారని వెల్లడించింది. మహిపాల్ సోదరులు సంగారెడ్డి పటాన్చెరువు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ నిర్వహించినట్లు గుర్తించింది.
Hairfall : మీ జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి