Site icon NTV Telugu

Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో బ్లాక్ టిక్కెట్ల దందా.. ఈడీ దర్యాప్తు ముమ్మరం..

Uppal

Uppal

Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో నిధుల గోల్మాల్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మూడు కంపెనీలకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 8న అజారుద్దీన్ను విచారించిన విషయం తెలిసిందే. అజార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బాడీడ్రెంచ్ ఇండియా, సర స్పోర్ట్స్, ఎక్స్లెంట్ ఎంటర్ప్రైజెస్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని కంపెనీలకు ఆదేశించింది. జనరేటర్స్, జిమ్ పరికరాలు, క్రికెట్ బాల్స్, ఇతర వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలసిందే.

Read also: SOT Police Raid: కోహినూరు సంస్థలో ఎస్ఓటి సోదాలు.. అదుపులో సంస్థ యజమాని..

అజారుద్దీన్ 2020 నుంచి 2023 వరకు హెచ్ సీ ఏలో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ చేశారని ఫారెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆగస్ట్ 10వ తేదీన హెచ్ సీ ఏ నిధులపై సుప్రీం కోర్ట మాజీ న్యాయవాది జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. ఇందులో క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. దీంతో ఉప్పల్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడంతో అజారుద్దీన్ పై పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు.

KTR Viral Tweet: పైసా పనిలేదు రాష్ట్రానికి లాభం లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..

Exit mobile version