BJP Maha Dharna: హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా చేయి చేసిన కీడు-మూసి బాధితులకు బీజేపీ తోడు పేరుతో బీజేపీ మహా ధర్నా చేపట్టనుంది.
మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసి పునరుజ్జీవన ప్రాజెక్ట్ బాధితులకు అండగా ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి బీజేపీ మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. బాధితులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మూసీ బాధితులు తదితరులు పాల్గొననున్నారు.
Read also: Hyderabad Pubs: బార్ పర్మిషన్ తో పబ్ నిర్వహణ.. పోలీసులు సీరియస్..
అలాగే ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని బీజేపీ తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ రూ.2 లక్షలు రుణ మాఫీ పూర్తిగా అమలయ్యే వరకు వదలబోమన్నారు. బీఆర్‌ఎస్ తరహాలో మోసాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. లక్ష మంది రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రూ.2 లక్షల రుణమాఫీపై ఎందుకు ఆంక్షలు ఎందుకు విధించారని? ప్రశ్నించింది. రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ పై ధర్నా చేపట్టనుంది.
Telangana Tourism: పర్యాటకులకు శుభవార్త.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణ సేవలు..