NTV Telugu Site icon

Maheshwar Reddy: రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదు..

Maheshwer Reddy

Maheshwer Reddy

Maheshwar Reddy: రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకునే ప్రసక్తే లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతు హామీల సాధన దీక్ష ఈ నెల 30 న నిర్వహిస్తామన్నారు. అధికారం లోకి వచ్చి తొమ్మిదిన్నర నెలలు అయిన ఇచ్చిన హామీలు ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రజలను మోసం చేసిందన్నారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు… కానీ చేయలేదని మండిపడ్డారు. రుణ మాఫీ సగం మందికి చేయలేదన్నారు. ఎక్కడకు వెళితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నారన్నారు. రాహుల్ గాంధీ చేతుల మీదుగా రైతు డిక్లరేషన్ చేయించారన్నారు. రుణమాఫీ పై రేవంత్ రెడ్డీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిప్డడారు. మంత్రులు రుణమాఫీ జరగలేదు అని అంటున్నారని తెలిపారు.

మీకు, మంత్రుల మధ్య ఉన్న గ్యాబ్ తెలుస్తుందన్నారు. రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు… కమిటీ రిపోర్ట్ బయట పెట్టడం లేదన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే బీజేపీ ఊరుకొనే ప్రసక్తే లేదన్నారు. ఉపాధి హామీ కూలీలను, కౌలు రైతులను మోసం చేశారన్నారు. వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని ఉత్తం కుమార్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలిపారు. సన్న వడ్ల కు మార్కెట్ లో ఎక్కువ ధర ఉన్నది.. మీకు ఎవరు ఇవ్వరన్నారు. బోనస్ అనేది బోగస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ మెడలు వంచుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో ఈ నెల 30 న ఇందిరా పార్క్ దగ్గర 24 గంటల దీక్ష చేపడతామన్నారు. ఎమ్మెల్యే లు ఎంపి లు దీక్ష లో పాల్గొంటారని తెలిపారు.
KTR: ఏపీ సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు..