NTV Telugu Site icon

Bike Racing: అర్ధరాత్రి రెచ్చిపోతున్న యువకులు.. రాయదుర్గం టీహబ్ వద్ద బైక్ రేస్..

Hyderabad

Hyderabad

Bike Racing: హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. బైక్‌ రేసింగ్‌లు, స్టంట్‌ల పై పోలీసుల ఆంక్షలను రేసర్లు లెక్కచేయడం లేదు. క్రిమినల్‌ కేసులు పెడతామంటున్నా రేసర్లు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం రాయదుర్గం పోలీసులు 80కిపైగా బైకులు సీజ్‌ చేయడమే కాకుండా.. పది మంది యువకులను అరెస్ట్‌ చేసి క్రిమినల్‌ కేసులు పెట్టారు. పోలీసులు చెదరగొడుతున్న వీడియోలను కూడా సరదాగా మార్చి సోషల్‌ మీడియాలో యువకులు అప్‌లోడ్‌ చేస్తూ ఈ ఘటనలను సరదాగా తీసుకుంటున్నారు. రేసర్లు కమ్‌ టు టీహబ్‌ అని, రేసింగ్‌ అడ్డా, వండరర్‌ స్పోర్ట్స్‌ అని పలురకాల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌, ఫేస్‌బుక్‌ పేజ్‌లు, వాట్సప్‌ గ్రూపులను క్రియేట్‌ చేశారు. వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌లపై కూడా కేసులు పెడతమన్నా యువకులు లెక్కచేయడం లేదు. రేసింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడ్డ యువకుల్లో స్టూడెంట్స్‌తోపాటు… ప్రైవేట్‌ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్‌, సెక్యూరిటీ గార్డ్స్‌ వున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read also: Revnath Reddy: నేడు మహబూబ్ నగర్ కు సీఎం.. రూ.110 కోట్లతో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాపన

వారిపై చర్యలు తీసుకుంటున్నా వీకెండ్ వచ్చిందంటే చాలు చేతిలో బైక్ లో అర్థరాత్రి రెచ్చిపోతున్నారు. రాయదుర్గం నాలెడ్ సిటీ టీహబ్ అడ్డాగా బైక్ రేస్ సాగిస్తున్నారు. బైక్ ముందు చక్రాలు గాల్లోకి లేపి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులకు తీవ్ర భాయందోళనకు గురిచేస్తున్నారు. బైక్ స్టాండ్ రోడ్డుకు తగిలేలా చేసి కొందరు పోకిరీలు మంటలు పుట్టిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు బైక్‌లపై స్టంట్లు చేస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తున్నారు. రేస్, స్టంట్లతో రాయదుర్గం నుంచి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన వద్దకు చేరుకుని పలువురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. బైక్ లను సీజ్ చేశారు. వీకెండ్ వచ్చిందంటే రాయదుర్గం టీహబ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికుల కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు. రాయదుర్గం టీహబ్ వద్ద పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేస్తారా? రేసింగ్ చేస్తున్న పోకిరీలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయా?
Devendra Fadnavis : మహారాష్ట్రలో ‘వోట్ జిహాద్’.. ఒవైసీ, ఎంవీఏలపై విరుచుకుపడ్డ దేవేంద్ర ఫడ్నవీస్

Show comments