Bike Racing: అర్ధరాత్రి రెచ్చిపోతున్న యువకులు.. రాయదుర్గం టీహబ్ వద్ద బైక్ రేస్..
- హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు..
- బైక్ రేసింగ్‌లు- స్టంట్ల పై పోలీసుల ఆంక్షలను రేసర్లు లెక్కచేయడం లేదు..
- క్రిమినల్ కేసులు పెడతామంటున్నాపట్టించుకోని రేసర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bike Racing: హైదరాబాద్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. బైక్ రేసింగ్‌లు, స్టంట్ల పై పోలీసుల ఆంక్షలను రేసర్లు లెక్కచేయడం లేదు. క్రిమినల్ కేసులు పెడతామంటున్నా రేసర్లు పట్టించుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం రాయదుర్గం పోలీసులు 80కిపైగా బైకులు సీజ్ చేయడమే కాకుండా.. పది మంది యువకులను అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు పెట్టారు. పోలీసులు చెదరగొడుతున్న వీడియోలను కూడా సరదాగా మార్చి సోషల్ మీడియాలో యువకులు అప్లోడ్ చేస్తూ ఈ ఘటనలను సరదాగా తీసుకుంటున్నారు. రేసర్లు కమ్ టు టీహబ్ అని, రేసింగ్ అడ్డా, వండరర్ స్పోర్ట్స్ అని పలురకాల పేర్లతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, ఫేస్బుక్ పేజ్‌లు, వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేశారు. వాట్సప్ గ్రూప్ అడ్మిన్లపై కూడా కేసులు పెడతమన్నా యువకులు లెక్కచేయడం లేదు. రేసింగ్‌లకు పాల్పడుతూ పట్టుబడ్డ యువకుల్లో స్టూడెంట్స్‌తోపాటు… ప్రైవేట్ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డ్స్ వున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read also: Revnath Reddy: నేడు మహబూబ్ నగర్ కు సీఎం.. రూ.110 కోట్లతో ఎలివెటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాపన
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
వారిపై చర్యలు తీసుకుంటున్నా వీకెండ్ వచ్చిందంటే చాలు చేతిలో బైక్ లో అర్థరాత్రి రెచ్చిపోతున్నారు. రాయదుర్గం నాలెడ్ సిటీ టీహబ్ అడ్డాగా బైక్ రేస్ సాగిస్తున్నారు. బైక్ ముందు చక్రాలు గాల్లోకి లేపి ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్థానికులకు తీవ్ర భాయందోళనకు గురిచేస్తున్నారు. బైక్ స్టాండ్ రోడ్డుకు తగిలేలా చేసి కొందరు పోకిరీలు మంటలు పుట్టిస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు బైక్‌లపై స్టంట్లు చేస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తున్నారు. రేస్, స్టంట్లతో రాయదుర్గం నుంచి వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో స్థానిక సమాచారంతో పోలీసులు ఘటన వద్దకు చేరుకుని పలువురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. బైక్ లను సీజ్ చేశారు. వీకెండ్ వచ్చిందంటే రాయదుర్గం టీహబ్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్థానికుల కోరుతున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారు. రాయదుర్గం టీహబ్ వద్ద పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేస్తారా? రేసింగ్ చేస్తున్న పోకిరీలకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయా?
Devendra Fadnavis : మహారాష్ట్రలో ‘వోట్ జిహాద్’.. ఒవైసీ, ఎంవీఏలపై విరుచుకుపడ్డ దేవేంద్ర ఫడ్నవీస్
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి