NTV Telugu Site icon

BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు

Bhujanga Rao Bail

Bhujanga Rao Bail

BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ మంజూరు చేయాలని భుజంగరావు వేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలు లేకుండా హైదరాబాద్ వదిలి వెళ్లరాదని ఆదేశించింది. కాగా, తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును పోలీసులు మార్చి 23న అరెస్టు చేశారు.

Read also: Raksha Bandhan 2024: రాఖీ ఇలా కడుతున్నారా?..

బెయిల్ కోసం పలుమార్లు అభ్యర్థించగా.. ఆ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. ఇటీవల భుజంగరావుకు గుండె సంబంధిత సమస్య కారణంగా బెయిల్ మంజూరైంది. ఈ కేసులో తొలుత మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఏ1 ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా.. తాజాగా ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు.

Heavy Vehicles: ఉదయం 7 గంటల తర్వాత సిటీలోకి భారీ వాహనాలు నో ఎంట్రీ..