Bhatti Vikramarka: భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చకుండా ఉండేలా చూస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లి స్వరూపం అనేక రూపాల్లో ఉన్నాయని అన్నారు. తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని రూపకల్పన చేసి సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని చారిత్రక, సంస్కృతికి అద్దం పడుతూ.. కంటే, హారంతో, కాళ్ళకు మెట్టెలతో, పచ్చని చీరతో, మన పంటలకు చిహ్నంగా రూపొందించామన్నారు.
Read also: UP: దారుణం.. టాయిలెట్ పైపులో కూరుకుపోయిన ఆరు నెలల పిండం!
తెలంగాణ తల్లికి వాడిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భట్టి విక్రమార్క తెలిపారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. ప్రతి ఏడాది 9వ తేదీని తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింని భట్టి విక్రమార్క తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పును కూడా పరిశీలిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్