NTV Telugu Site icon

Bandi sanjay: కేటీఆర్‌ ని బీఆర్ఎస్ పార్టీ నే పట్టించుకునే పరిస్థితి లేదు.. బండి కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: కేటీఆర్‌ ని బీఆర్ఎస్ పార్టీనే పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేటీఆర్, కేసీఆర్, గత ప్రభుత్వం సర్పంచ్ లకి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి‌ సర్పంచ్ ల గురించి మాట్లాడే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయంలోనే సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పది ఎంపీ సీట్లు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తొందరలోనె ఎంపి అభ్యర్థులని ప్రకటించి ఎన్నికలకి పొతామన్నారు. ఎన్డీఏ కూటమి 400,బిజేపి 350 సీట్లు గెలుస్తుందని అన్నారు. ఇండియా కూటమి‌ దిక్కులేని నావ,రొజురోజుకి కూటమి నుండి ఒక్కొక్కరు బయటికి వస్తున్నారని అన్నారు. కేటీఆర్ ని బీఆర్ఎస్ పార్టీనే పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ బార్ పెట్టుకోవాలి, ఉప ఎన్నికల సమయంలోనే కేసీఆర్ బయటికి వస్తారన్నారు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. దేవున్ని నమ్మని నాస్తికులకి ఎలా ఓట్లు వేస్తారని అన్నారు.

Read also: Cannabis Chocolates: రామాంతపూర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు.. ఆందోళనలో గాంధీనగర్ వాసులు

కరీంనగర్ లో బీఆర్ఎస్ కి‌ అభ్యర్థికి లేక పక్క జిల్లా నుండి తీసుకువచ్చి పోటి చేపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కే సీఎం అవుతానని నమ్మకం లేదు, త్వరలో ఎలా సీఎం అవుతాడో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కారు షెడ్డు కి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం సర్పంచుల సమస్యలు పట్టించుకొలేదని, సర్పంచిల సమస్యలు ఈ ప్రభుత్వం అయిన పట్టించుకొవాలన్నారు. పదవీకాలం ముగుస్తున్న సర్పంచులకి కొట్ల రూపాయల అప్పులు ఉన్నవని, కేంద్రం నేరుగా సర్పంచులకి డబ్బులు ఇస్తే గత ముఖ్యమంత్రి నిధులని దారి మళ్లీంచారని ఆరోపించారు.

నిధులు‌ మళ్ళీంచిన గత ముఖ్యమంత్రి కెసిఅర్ పై కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచ్ లు పనులు చేస్తే.. బిల్లుల రికార్డులు చేయలేదని, బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సర్పంచ్ ల మెడమీద కత్తి పెట్టి అధికారులు పనులు చేపించారన్నారు. ఏకగ్రీవ పంచాయితీ లకు ఇస్తామన్న నిధులు ఇవ్వకుండా సర్పంచులని, గ్రామాల ప్రజల్ని మోసం చేసింది బీఆర్ఎస్ అంటూ నిప్పులు చెరిగారు. సర్పంచులని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సర్పంచ్ లు చేసే పోరాటానికి బిజెపి పార్టీ మద్దతు, వారిది న్యాయమైన పోరాటం అన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీలకి సంవత్సరం నుండి‌ జీతాలు రాలేదని గుర్తు చేశారు.
Miryalguda Accident: మిర్యాలగూడ రోడ్డు ప్రమాదం.. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్