Site icon NTV Telugu

Bandi Sanjay: నేను కేంద్ర మంత్రినైనా మీకోసం రోడ్డెక్కుతున్న.. గ్రూప్ 1 అభ్యర్థులతో బండి సంజయ్..

Bandi Sanjay Group1

Bandi Sanjay Group1

Bandi Sanjay: మీరే ప్రశాంతంగా చదువుకోండి.. మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. నేను కేంద్ర మంత్రినైనా.. మీకోసం రోడ్డెక్కుతున్నానని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో గ్రూప్ వన్ అభ్యర్థులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్లిన బండి సంజయ్ అభ్యర్థులతో మాట్లాడారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీ పక్షాన బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. మీరంతా ప్రశాంతంగా చదువుకోండి… మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. నేను కేంద్ర మంత్రినైనా… మీకోసం రోడ్డెక్కుతున్నా అన్నారు. జీతాలిచ్చే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అందుకే కావాలనే ఏదో ఒక లిటిగేషన్ పెట్టి గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడేలా చేస్తోందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా 29 జీవోను జారీ చేసిందన్నారు.

Read also: Bandi Sanjay: రేవంత్ తో మాకు దోస్తీ అవసరమేంది..? కేటీఆర్ ట్వీట్ పై బండి సంజయ్ ఆగ్రహం..

బండి సంజయ్ తో గ్రూప్ 1 అభ్యర్థులు

బండి సంజయ్ తో గ్రూప్ 1 అభ్యర్థులు కలిశారు. అనంతరం అభ్యర్థులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 29 ఉత్వర్వులవల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోయారు. హాస్టళ్లలో చదువుకుంటున్న మమ్ముల్ని బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలమని కూడా చూడకుండా హాస్టల్ లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని మహిళా అభ్యర్థులు కన్నీరుపెట్టుకున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే… మాపై నక్సల్స్ అని ముద్ర వేసి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 పరీక్షల కోసం రాముడి వనవాసం మాదిరిగా 12 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చిందన్నారు. తెలుగు అకాడమీ సిలబస్ కూడా చదవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని వాపోయారు. తమకు మీడియా నుండి సరైన సహకారం అందడం లేదని కంట నీరు పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
Tummala Nageswara Rao: వారికి రైతు భరోసా ఇవ్వలేము.. తుమ్మల సంచలన వ్యాఖ్యలు

Exit mobile version